80 సీట్లతో టీఆర్ఎస్ గెలుపు ఖాయం : కేటీఆర్

పోలింగ్ సరళి బాగుందన్నారు రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్. ఈ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ దే అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ కే సానుకూల ఫలితాలు రాబోతున్నాయన్నారు. మూడింట రెండు వంతుల మెజారిటీతో టీఆర్ఎస్ విజయఢంకా మోగించబోతోందని కేటీఆర్ చెప్పారు. పోలింగ్ ముగింపు సందర్భంగా టీఆర్ఎస్ విజయంపై ధీమాతో ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇవాళ ఉదయం మంత్రి కేటీఆర్  సెయింట్ నిజామీన్ స్కూల్, బంజారాహిల్స్ లో ఓటేశారు. అందరూ ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Posted in Uncategorized

Latest Updates