80 కోట్ల మందికి రూ. 3కే కిలో బియ్యం

క‌రోనా నివార‌ణ‌కు సోష‌ల్ డిస్టెన్సే ఏకైక మార్గ‌మ‌ని తెలిపారు కేంద్ర‌మంత్రి జ‌వ‌దేక‌ర్. ప్ర‌జలు లాక్ డౌన్ పాటించాల‌ని చెప్పారు. క‌రోనా దృష్ట్యా దేశ ప్ర‌జ‌ల‌కు అన్ని సౌక‌ర్యాలు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం దేశంలోని 80 కోట్ల మంది ప్ర‌జ‌ల కోసం రేష‌న్ స్కీమ్ ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు తెలిపారు. దీంతో కిలో బియ్యం రూ.3కే రానుండ‌గా..కిలో గోదుమ‌లు రూ.2కే అందిస్తామ‌న్నారు. నిత్య‌వ‌స‌ర దుకాణాలు నిర్ణీత స‌మ‌యంలో తెరిచే ఉంటాయ‌ని చెప్పారు.

Latest Updates