ఆ హాస్పిటల్‌కు వచ్చిన 800 మంది క్వారంటైన్‌కు తరలింపు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. ఇప్పుడు ఢిల్లీలో కలకలం రేపుతోంది. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన మహిళకు ట్రీట్‌మెంట్ చేసిన డాక్టరుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలో మొహల్లా క్లీనిక్ ఉంది. ఈనెల 12న సౌదీ నుంచి వచ్చిన మహిళ ఆ క్లీనిక్‌కి వచ్చింది. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో చికిత్స కోసం ఈ హాస్పిటల్‌కి వచ్చింది. పరీక్ష చేసిన డాక్టర్ ఆమెకు కరోనా సోకినట్లు తేల్చారు. దాంతో ఆమెకు కొన్నిరోజుల పాటు చికిత్సనందించారు. ఆ తర్వాత డాక్టర్ అనారోగ్యానికి గురవడంతో… ఆయనకు కూడా పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో ఆయనకు కూడా కరోనా సోకినట్లు తేలింది. అంతేకాకుండా.. ఆయన భార్య, కూతురుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. డాక్టర్ కుటుంబానికి కరోనా సోకడంతో అక్కడి అధికారులలో ఆందోళన పెరిగింది. ప్రస్తుతం వారందరిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

కాగా..  ఈ నెల 12 నుంచి మొహల్లా క్లీనిక్‌కు వచ్చిన వారందరిని గుర్తించి ఐసోలేషన్‌కు పంపించారు. ఈ నెల 12 నుంచి ఆ క్లీనిక్‌కు దాదాపు 800 మంది వచ్చిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పుడు వారందరిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించినట్లు ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ తెలిపారు.

For More News..

తన వైరస్ కుటుంబానికి సోకకూడదని వ్యక్తి ఆత్మహత్య

కరోనా ఎఫెక్ట్: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా.. అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే..

అమెజాన్‌లో కరోనా వైరస్ టెస్టింగ్ కిట్లు!

కరోనా నివారణకు రూ. రెండు కోట్ల విరాళం

Latest Updates