24 గంటల్లో 204 కరోనా మరణాలు..2 లక్షలకు చేరువైన కేసులు

భారత్ లో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు చాలా వేగంగా వైరస్ వ్యాప్తి చెందడంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో 8171 కరోనా కేసులు, 204 మంది చనిపోయారు. దీంతో  దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,98,706 చేరగా మరణాల సంఖ్య 5,598 మంది కి చేరింది. ఇప్పటి వరకు  95,526 మంది కరోనా నుంచి కోలుకోగా 97,581 మంది చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 70013 కు చేరగా మరణాల సంఖ్య 2362కు చేరింది. ఆ తర్వాత అత్యధికంగా గుజరాత్ లో 1063 మంది చనిపోయారు.

Latest Updates