ఏపీలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్థృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,218 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 6,17,776కి చేరింది. ఇందులో 81763 కేసులు యాక్టివ్ గా ఉండ‌గా.. 530711 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 58 మంది కరోనాతో మరణించారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 5302కు చేరింది. ఇదిలా ఉండ‌గా.. శ‌నివారం ఒక్కరోజే ఏపీలోని జిల్లాల్లో నమోదైన కేసులు.. తూర్పు గోదావరిలో 1395, పశ్చిమ గోదావరిలో 1071, చిత్తూరులో 736, నెల్లూరులో 693, ప్రకాశం జిల్లాలో 670, కడపలో 520, అనంతపూర్ లో 477, గుంటూరులో 471, కృష్ణా జిల్లాలో 468, కర్నూలులో 319, శ్రీకాకుళంలో 485, విశాఖపట్నంలో 451, విజయనగరంలో 462, కేసులు నమోదయ్యాయి.

 

Latest Updates