826 ప్రాంతాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో బస్ షెల్టర్లు: కేటీఆర్

bus-shelterహైదరాబాద్ లో అధునాతన బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. 826 ప్రాంతాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో మంచి బస్ షెల్టర్లు కడుతున్నామని చెప్పారు. అందులో భాగంగా సోమాజిగూడ, కూకట్ పల్లిలో బస్ షెల్టర్లు, ఏటీఎం మిషిన్, క్యాంటీన్, మోడ్రన్ టాయిలెట్ ను మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు మంత్రి కేటీఆర్.  GHMC,PPP సంయుక్తంగా ప్రపంచస్థాయి బస్ షెల్టర్ల నిర్మాణం చేపడుతున్నాయన్నారు. రాబోయే 6 నెలల్లో బస్సు షెల్టర్లు పూర్తి చేస్తామని… త్వరలో 3,800 ఆర్టీసీ బస్సులను ఆధునీకరిస్తామన్నారు. అందులో భాగంగా 500 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.మెట్రో పనులతో వస్తున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని చెప్పారు. హైదరాబాద్ విశ్వనగరంగా మార్చేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటామన్నారు.

కొత్త బస్ షెల్టర్లలో ఏసీ, వైఫై, ఏటీఎం, సీసీటీవీ సౌకర్యం, ఎమర్జెన్సీ హారన్, మొబైల్ ఛార్జింగ్, డస్ట్‌బిన్లు, టికెట్ల కౌంటర్లు, ఫీడింగ్ రూమ్, మంచినీరు వంటి మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates