83ఏళ్ల వయసులో.. కొడుకు కోసం మళ్లీ పెళ్లి

sukhramకొడుకు లేడన్న సాకుతో ఓ 83 ఏళ్ల వృద్ధుడు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన రాజస్థాన్ లో జరిగింది. కరౌలి జిల్లా సోమ్ రైదా గ్రామానికి చెందిన సుఖ్ రామ్ కు 50 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. అతడి ఒక్కగానొక్క కొడుకు 15 ఏళ్ల కిందట చనిపోయాడు. దీంతో కొడుకోసం మళ్లీ పెళ్లికి రెడీ అయ్యాడు. 83 ఏళ్ల వయసులో సుఖ్ రామ్ మళ్లీ పెళ్లికొడుకయ్యాడు. ఆదివారం (ఫిబ్రవరి-18) జరిగిన పెళ్లిలో సుఖ్ రామ్ పెళ్లి దుస్తుల్లో గుర్రం ఎక్కి వీధుల్లో ఊరేగుతూ తన వయసులో సగం కూడా లేని.. 30 ఏళ్ల రమేషి దేవిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి సుఖ్ రామ్ మొదటి భార్య కూడా హాజరైంది.

 

Posted in Uncategorized

Latest Updates