87 KGBV లు ఇంటర్ స్థాయికి పెంపు

JGVఅమ్మాయిలకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో ఉన్న 87 కస్తూర్బా గాంధీ బాలికల(KGBV) విద్యాలయాలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్ గ్రేడ్ చేశారు. దీనికి సంబంధించి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2018-19 నుంచి ఇంటర్  మొదటి ఏడాది.. 2019-20 నుంచి రెండో ఏడాది తరగతులు ప్రారంభం కానున్నాయి. తెలుగు మీడియంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో 40 చొప్పున సీట్లు కేటాయించారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్ స్థాయికి పెంచడంతో విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates