89 కి చేరిన గులాబీ బలగం.. టీఆర్ఎస్ కు జై కొట్టిన స్వతంత్ర అభ్యర్థి

రామగుండం నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్తి కోరుగంటి చందర్ టీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. దీంతో టీఆర్ఎస్ బలం 89 కి చేరింది.బేగం పేట లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ను చందర్ కలిశారు. తన మాతృ సంస్థ టీఆర్ఎస్ అని..  ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేశానని తెలిపారు. ఇక ముందు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని చందర్ అన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించిన చందర్‌ సీటు దక్కకపోవడంతో ఫార్వర్డు బ్లాక్‌ నుంచి పోటీచేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమవరపు సత్యనారయణపై విజయం సాధించారు. ఎన్నికల వరకు కూడా చందర్ టీఆర్‌ఎస్‌లోనే కొనసాగారు.

Posted in Uncategorized

Latest Updates