8,9 తేదీల్లో ఆర్టీసీ సమ్మె

హైదరాబాద్‍ : కేంద్రం ప్రవేశపెట్టిన మోటార్‌ వెహికిల్‌ చట్ట సవరణ బిల్లు-2017కు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు జనవరి 8,9తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. కేంద్రం ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని విమర్శించాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు తెలిపాయి. ఇందులో భాగంగా ఆర్టీసీ అధికారులకు అన్ని కార్మిక సంఘాలు విడివిడిగా సమ్మె నోటీసులు అందిం చాయి. ఎంప్లాయీస్ యూనియన్‍, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, కార్మిక సంఘ పరిషత్, బహుజన కార్మిక యూనియన్ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు . సవరణ బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంప్లా యీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిమాండ్‍ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్.బాబు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్‍.రావు, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు అబ్రహాం, కార్మిక పరిషత్ ప్రధాన కార్యదర్శి యాదగిరి, బహుజన వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేశ్‌ పాల్గొన్నారు .

Posted in Uncategorized

Latest Updates