ఫొని తుఫాను: 89 రైళ్లు రద్దు

ఫొని తుఫాను ప్రభావంతో 89 రైళ్లు రద్దయ్యాయి. ఇందుకు గాను భారత రైల్వే ప్రకటించింది. రైళ్ల రద్దు వల్ల ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు నిర్ణత సమయంలోపు క్యాన్సిల్ చేసుకుంటే 100% మనీని రిఫండ్ చేయనున్నట్లు తెలిపారు రైల్వే అధికారులు.

రద్దైన రైళ్లలోఢిల్లీ-భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌,  హౌరా-హైదరాబాద్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, హౌరా-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌, పట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌, భువనేశ్వర్‌-రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌లు ఢిల్లీ-పూరీ నందన్‌కనన్‌ ఎక్స్‌ప్రెస్‌,  పూరీ-ఢిల్లీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

Latest Updates