కరోనా పంజా..24 గంటల్లో 8909 కేసులు..217 మరణాలు

ఇండియాలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య రికార్డులు సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు 8 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో భారత్ లో 8909 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 217 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,07,615 కేు చేరగా మృతుల సంఖ్య 5815 కు చేరింది. ఇప్పటి వరకు 100303 మంది కరోనా నుంచి కోలుకోగా ..101497 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 1,37,158 మంది శాంపిల్స్ సేకరించారు. ఇప్పటి వరకు భారత్ లో 41,03,233 మందికి కరోనా టెస్టులు చేశారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 72300 కరోనా కేసులు నమోదవ్వగా  2465 మంది చనిపోయారు.

Latest Updates