9 దాటిన వదల్లేదు : హైదరాబాద్ ను కమ్మేసిన పొగమంచు

హైదరాబాద్ : సిటీలో చలి బాగా పెరిగిపోయింది. బయటికి రావాలంటే జనం భయపడుతున్నారు. టెంపరేచర్స్ బాగా పడిపోయాయి. ఉదయం 9 దాటినా సూర్యుడు కనిపించట్లేదు. కొన్ని రోడ్లు మంచుతో నిండి ఢిల్లీ రోడ్లను తలపిస్తున్నాయి. రోడ్లపై దట్టంగా పొగమంచు రావడంతో సోమవారం ఉదయం వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ఖైరతాబాద్, ట్యాక్ బండ్, నెక్లస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ సహా నగర శివారు ప్రాంతాల్లో మంచు కమ్ముకోవడంతో ఆ ప్రాంతాలన్నీ మబ్బుతో మునిగిపోయాయి. బయటికి వెళ్లాలంటే స్వెటర్ కంపల్సరీ అంటున్నారు పబ్లిక్. కొందరు మాత్రం ఈ కూల్ వెదర్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చలి ఎక్కువగా ఉన్న రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలని సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్స్.

Posted in Uncategorized

Latest Updates