ఐదేళ్లలో 9కోట్ల 60లక్షల టాయిలెట్లు కట్టించాం : నిర్మల

5లక్షల 60వేల గ్రామాల్లో బహిరంగ మల విసర్జన లేకుండా చేశాం

ఈ విజయం ఆధారంగా స్వచ్ఛభారత్ సాధిస్తాం: నిర్మల

మహాత్మాగాంధీ సూచించిన స్వచ్ఛభారత్ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్రం ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్. మోడీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత… 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున స్వచ్ఛభారత్ ను ప్రారంభించామన్నారు. స్వచ్ఛ భారత్ నినాదంతో… విస్తృతంగా ప్రచారం చేశామన్నారు. 2014 అక్టోబర్ 2 నుంచి.. ఇప్పటివరకు దేశమంతటా 9కోట్ల 60లక్షల టాయిలెట్లు కట్టించామని చెప్పారు.

దేశమంతటా .. 5లక్షల 60 వేల గ్రామాల్లో బహిరంగ మల విసర్జన అనేది లేకుండా చైతన్యం తీసుకొచ్చామన్నారు నిర్మల. ఈ విజయం ఆధారంగా మరింతగా ప్రగతి నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. గ్రామాల్లో స్వచ్ఛభారత్ మిషన్ ను మరో స్టేజీకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణను స్థిరంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని .. గ్రామాలు అందుకు సిద్ధంగా ఉండాలని కోరారు నిర్మలా సీతారామన్.

Latest Updates