9 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లకు కరోనా

న్యూఢిల్లీ : కరోనా నివారణలో భాగంగా లాక్ డౌన్ ను అమలు చేసేందుకు డ్యూటీ చేస్తున్న సీఆర్ఫీఎప్ జవాన్లకు కరోన సోకుతోంది. తాజాగా న్యూఢిల్లీలోని సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న 9 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. వీరంతా నరేలా ప్రాంతంలో డ్యూటీ చేశారు. అనుమానిత లక్షణాలుండటంతో టెస్ట్ చేయగా 9 మందికి కరోనా వచ్చినట్లు గుర్తించారు. వెంటనే వీరికి హాస్పిటల్ కు తరలించి ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారు. అదే విభాగంలో పనిచేస్తున్న మరో 47 మందిని సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాలని సూచించారు. ఢిల్లీలో కరోనా కేసులు అధికంగా ఉండటంతో విధులు నిర్వహిస్తున్న జవాన్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

Latest Updates