హైకోర్టుకు ఈ నెలలో 9 రోజులు సెలవులు

హైదరాబాద్, వెలుగు: హైకోర్టుకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో శని, ఆదివారాలు కలిసి రావడంతో వరుసగా 9 రోజులు హాలీడేస్ వచ్చాయి. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. వెకేషన్‌ కోర్టులు ఈ నెల 12న పని చేస్తాయని.. జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్, జస్టిస్‌ ఎ. అభిషేక్‌ రెడ్డి బెంచ్ కేసుల విచారణ చేపడతాయని వివరించారు. 11న పిటిషన్లు ఫైల్ చేసుకోవచ్చన్నారు. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు, ముందస్తు బెయిల్స్, బెయిల్‌ అప్పీల్స్,  అత్యవసర కేసులను వెకేషన్‌ కోర్టులు విచారిస్తాయన్నారు.

For More News..

ఈ ఏడాది 20 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు

ఉమ్మడి రాష్ట్రంలో కబ్జాలు.. ఇప్పుడు సెటిల్‌మెంట్లు

Latest Updates