అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

9 earthquakes hit Andaman and Nicobar Islands in 2 hours

పోర్ట్‌బ్లెయిర్ : అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం ఉదయం మరోసారి భూకంపం సంభవించింది. రెండు గంటల వ్యవధిలో భూమి తొమ్మిది సార్లు కంపించింది. భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.7 నుంచి 5.2 గా నమోదైందని శాస్త్రవేత్తలు చెప్పారు. మొదట తెల్లవారుజామున 5:14 గంటల సమయంలో భూమి కంపించగా, రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 4.9గా నమోదైంది. మళ్లీ రెండు నిమిషాల తర్వాత భూమి కంపించింది. చివరగా 6:54 గంటల సమయంలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. ఇలా రెండు గంటల వ్యవధిలో తొమ్మిది సార్లు భూప్రకంపనలు సంభవించాయి. ఈ భూప్రకంపనలతో ప్రజలు ఆందోళన చెందారు.

Latest Updates