ఈ సారి ఖైరతాబాద్ గణేశుడు 9 అడుగుల మట్టి విగ్రహమే

హైదరాబాద్, వెలుగు: కోవిడ్ విపత్తు వల్ల ఈ సారి ఖైరతాబాద్ గణేశుడిని మట్టితో 9 అడుగుల ఎత్తుతో తయారు చేస్తున్నారు. 66వ సంవత్సరం మహా విష్ణువు రూపంలో దర్శనమివ్వనున్న మహాగణపతికి శ్రీధన్వంతరి నారాయణ మహా గణపతిగా పేరు పెట్టారు. విగ్రహం హైట్‌ ఆరు అడుగులు, బేస్‌ మూడు అడుగులు ఉంటుందనిఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ తెలిపారు. మహాగణపతికి ఇరు వైపుల లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి విగ్రహాలను నాలుగు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహ తయారీ కోసం కళాకారుడు నగేశ్‌ నేతృత్వంలో 8 మంది పనిచేస్తున్నారు. 22వ తేదీ నాటికి విగ్రహం పూర్తవనుందన్నారు. కరోనా నేపథ్యంలో భక్తులు ఎవరూ రావొద్దని, ఆన్‌లైన్‌లో దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.

Latest Updates