అమ్మవారి అనుగ్రహమేమో : తొమ్మిదిరోజులు.. తొమ్మిదిమంది ఆడపిల్లలు

నవరాత్రి ఉత్సావాల్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నవరాత్రి ప్రారంభం మొదటి రోజున ఒకే రోజు తొమ్మిది మంది ఆడపిల్లలు జన్మించారు. మహరాష్ట్ర థానే జిల్లా కల్యాణ్ అనే సిటీకి చెందిన వైష్ణవి ఆస్పత్రిలో తొమ్మిదిమంది ఆడపిల్లలు జన్మించడంపై డాక్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నవరాత్రి మొదటి రోజైన శనివారం రోజున వైష్ణవి ఆస్పత్రిలో ఒకే రోజు 11మంది గర్భిణీలు డెలివరీలో అయ్యారు. వారికి మొత్తం 11మంది పిల్లలు జన్మించగా అందులో 9మంది ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు పుట్టారు.

ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు ప్రపంచం లోని హిందువులందరికీ పరమ పవిత్రమైనవి. అమ్మవారి అనుగ్రహం కావొచ్చు. ఈ పవిత్రమైన రోజున ఆడపిల్లలు పుట్టడం ఆస్పత్రి చరిత్రలో అరుదైన సంఘటన అంటూ డాక్టర్ అశ్వన్ కక్కర్ తెలిపారు. ఆ 11మంది తల్లీ, పిల్లల ఆరోగ్యం బాగుందన్నారు. తాము ఆస్పత్రి ప్రారంభించి 18ఏళ్లు అవుతుందని, ఈ 18ఏళ్లలో తొలిసారి ఒకేరోజు 11డెలివరీలు చేశామని, అందులో 9మంది ఆడపిల్లలు పుట్టడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ కక్కర్ ఆనందం వ్యక్తం చేశారు.

Latest Updates