ఒక్క స్టూడెంట్ ఎగ్జామ్ కు 9 మంది డ్యూటీ

ఎస్సెస్సీ ఎగ్జామ్​ అంటే వందల మంది స్టూడెంట్స్ , వాళ్ల కోసం ఇన్విజిలేటర్లు, సీఎస్, డీవోలు ఉండటం సర్వసాధారణం. అయితే శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సీఎస్ఐ హైస్కూల్ పరీక్ష కేంద్రంలోఒకే ఒక స్టూడెంట్​ పరీక్ష రాసింది. తాండూర్ ​మండలానికి చెందిన బయ్య అనిత అనే ప్రైవేట్ ​స్టూడెంట్ గతంలో అనారోగ్య కారణాలతో పరీక్ష రాయలేకపోయింది. శనివారం ఆమె పరీక్ష రాయడానికి రాగా మొత్తం తొమ్మిది మంది సిబ్బంది విధులు నిర్వహించారు. చీఫ్​ సూపరింటెండెంట్ ,డిపార్ట్​మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్, క్లర్క్,కానిస్టేబుల్, అటెండర్, ఇద్దరు వైద్య సిబ్బంది డ్యూటీలో ఉన్నారు. ఈ పరీక్ష కేంద్రాన్ని ఫ్లైయింగ్ స్క్వాడ్​ బృందం తనిఖీ చేయడం మరో విశేషం.

Latest Updates