షేర్ మార్కెట్ పేరుతో రూ.9 ల‌క్ష‌ల మోసం..ముఠా అరెస్ట్

హైదరాబాద్: షేర్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అధిక మొత్తంలో లాభాలు చూపిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న 9మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు. షేర్ మార్కెట్ లో అనుభవం ఉందంటూ వనస్థలిపురంకు చెందిన ఓ ప్రయివేట్ ఉద్యోగి ద‌గ్గ‌ర‌ 9.60లక్షలు ట్రాన్ఫర్ చేయించుకొని మోసం చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు నిందితులు. టాప్ గ్లోబల్ రీసెర్చ్ కంపెనీ పేరుతో అమాయకులకు వల వేస్తూ..రూ. లక్షల్లో దోపిడీ చేస్తున్నారు.

మధ్యప్రదేశ్ నుండి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా అదులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. ఫోన్ ద్వారా కాంటెక్ట్ చేస్తూ అమాయకులను సెలెక్ట్ చేసుకొని డీ మార్ట్ అకౌంట్ ఓపెన్ చేయించి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. 13 కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు,18మొబైల్స్, 17సిమ్ కార్డ్స్, 1ల్యాప్ టాప్, 4క్రెడిట్ కార్డ్స్, 1వైఫై రూటర్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Latest Updates