తొమ్మిది నెలల పాపకు కరోనా

  • తబ్లిగికి వెళ్లివచ్చిన తండ్రి నుంచి వైరస్

డెహ్రాడూన్: ఉత్తరాఖంఢ్ లో తొమ్మిది నెలల శిశువుకు కరోనా సోకింది. తబ్లిగి నుంచి తిరిగి వచ్చిన తర్వాత శిశువు తండ్రి నుంచి ఆ పాపకు వైరస్ సోకినట్లు అధికారులు తేల్చారు. పాపను ఐసోలేషన్ లో ఉంచినట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. శిశువుతో కలిపి శనివారం మూడు కొత్త కేసులు ఫైల్ అయ్యాయని, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 40కి పెరిగిందన్నారు. ఇప్పటికే ఐసోలేషన్ లో ఉన్న పది మంది ఢిల్లీ జమాత్ సభ్యులలో శిశువు తండ్రి ఒకరని చెప్పారు. అయితే, శిశువు తల్లికి కరోనా నెగెటివ్ వచ్చిందన్నారు. సైనిక ఆసుపత్రిలో ఒక మహిళా అధికారి, నైనిటాల్ జిల్లాకు చెందిన తబ్లిగి సభ్యురాలికి శుక్రవారం టెస్టులు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందన్నారు.

Latest Updates