ఇంగ్లండ్-విండీస్ సిరీస్ లో 9మంది రిజర్వ్ ప్లేయర్లు

విండీస్​తో ఫస్ట్​టెస్ట్​కు ఇంగ్లండ్ టీమ్ ప్రకటన

బెయిర్ స్టో, ఆలీకి చుక్కెదురు

న్యూఢిల్లీ: వెస్టిండీస్​తో జరగబోయే తొలి టెస్ట్​లో ఇంగ్లండ్​ పేస్ ​బౌలింగే ప్రధాన ఆయుధంగా బరిలోకి దిగనుంది. మూడు మ్యాచ్ల సిరీస్​లో ఫస్ట్​ టెస్ట్​ కోసం ఇంగ్లండ్​ అండ్​ వేల్స్ ​క్రికెట్ బోర్డు(ఈసీబీ) శనివారం జట్టును ప్రకటించింది. దాదాపు నాలుగు నెలల తర్వాత జరగనున్న ఈ తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఇంగ్లండ్​ ఒకే ఒక్క స్పిన్నర్​తో బరిలోకి దిగుతోంది. రెగ్యులర్​కెప్టెన్ జో రూట్ ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండకపోవడంతో బెన్ స్టోక్స్​కు కెప్టెన్సీ అప్పగించింది. 13 మందితో కూడిన జట్టులో వికెట్ కీపర్ ​బ్యాట్స్​మన్ జానీ బెయిర్​స్టో, ఆల్రౌండర్ ​మొయీన్అలీకి అవకాశం దక్కలేదు. కరోనా నేపథ్యంలో తొమ్మిది మందిని రిజర్వ్​ప్లేయర్లుగా సెలెక్ట్ ​చేశారు. సామ్ కరన్కు రిజర్వ్ ​లిస్ట్​లో చోటు దక్కింది.

జట్టు: బెన్ స్టోక్స్​(కెప్టెన్), జేమ్స్ ​ఆండర్సన్, ఆర్చర్​, డామినిక్బెస్​, స్టువర్ట్​బ్రాడ్​, బర్న్స్, జోస్​బట్లర్​(కీపర్), జాక్ క్రావ్లే, జో డెన్లీ, ఒడెన్లీ లీ పోప్​, సిబ్లే, క్రిస్​వోక్స్​, మార్క్ వుడ్. రిజర్వ్ ​ప్లేయర్లు: జేమ్స్​బ్రాకే, సామ్కరన్, బెన్ఫోక్స్​, డాన్లారెన్స్, జాక్లీచ్, సకీబ్ మహమూద్​, క్రెయిగ్ ఓవర్టన్, ఒలీ రాబిన్‌‌సన్‌‌​, ఒలీస్టోన్.

Latest Updates