900 మంది ఖైదీలకు క్షమాభిక్ష : మంచి పనులతో మార్కులు కొట్టేశారు

ఢిల్లీ : నేరాలు చేసి జైలు పాలైన ఖైదీలకు .. జైలు జీవితం గుణపాఠం నేర్పింది. మంచి పనులతో చేసిన తప్పులను సరిదిద్దుకున్నారు. ఫలితంగా ఫ్యామిలీని కలిసే అవకాశాన్ని కొట్టేశారు. గాంధీజీ 150వ జయంతి వేడుకలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సత్ప్రవర్తన కల్గిన ఖైదీలకు విముక్తి కల్పించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 900 మంది ఖైదీలను క్షమాభిక్ష పేరిట విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఇవాళ జైళ్లశాఖకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. దీంతో ఎళ్ల తరబడి శిక్ష అనుభవించాల్సిన ఖైదీలు జాతిపిత మహాత్మాగాంధీ పుణ్యమా అని పుట్టిల్లు చేరబోతున్నారు.

Posted in Uncategorized

Latest Updates