ఆన్ లైన్ ప్లేస్ మెంట్లా అంటే ఏంది

  • చదువయ్యాక మొదటి అడుగులు సర్కారీ కొ లువు వైపే
  • స్కిల్స్ ఉన్న 38% మంది కంపెనీ పెట్టాలనుకుంటున్నరు
  • పై చదువులు కావాలంటున్న56% మంది.. ఎంఎస్ డీఎఫ్ సర్వే

ఒకప్పుడు చేతిలో డిగ్రీ పట్టాలు పట్టుకుని ఉద్యోగ వేటకు వెళ్లేటో ళ్లు అప్పటోళ్లు. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేటట్టు తిరిగేటోళ్లు. అట్ల తిరిగినా కొన్ని చోట్ల నో వెకెన్సీ బోర్డులే కనిపించేవి. కానీ, ఇప్పుడు కాలం మారింది. నెట్ చేతికొచ్చింది. ఇంట్లోకూర్చునే ప్రతిదీ తెప్పించుకునే వెసులుబాటు దొరికింది. ఆన్ లైన్ లో ఒక్క క్లిక్ చేస్తే సరి. కానీ, అదేందో ఆన్ లైన్ లో గిర్రగిర్ర తిరిగే కుర్రకారు.. జాబ్ ల కోసం మాత్రం ఆ ఆన్ లైన్ ను వాడుకోలేకపోతున్నారట. క్యాంపస్ ప్లేస్ మెంట్లు మిస్సయిపోతే,ఉద్యోగాలను వెతుక్కునేందుకు ఇప్పుడు చాలా ఆన్ లైన్ పోర్టళ్లున్నాయి. కానీ, 92 శాతం మంది యువతకు ఆ ఆన్ లైన్ ప్లేస్ మెంట్ల గురించి తెలియనే తెలియదట. మైకేల్, సుసాన్ డెల్ ఫౌండేషన్ (ఎంఎస్ డీఎఫ్) విడుదల చేసి న సర్వేలో వెల్లడైందీ విషయం. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు, ఉద్యోగాలు వెతుక్కోవడంలో ఉన్న సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఆరో ఎడిషన్ ఇండియా ఎడ్యుకేషన్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డే సందర్భంగా 1605 మందిపై ఈ సర్వే చేశారు. శుక్రవారం ఆ సర్వే రిపోర్టును విడుదల చేశారు.

ప్రభుత్వ ఉద్యోగమే కావాలె..

చదువు అయిపోయాక మొదటిసారిగా సర్కారీ కొలువుకే చాలా మంది మొగ్గు చూపుతున్నట్టు సర్వేలో తేలిం ది. ప్రైవేట్ లో ఉద్యోగ భద్రత ఉండదన్న ఉద్దేశంతో తొలి అడుగులు ప్రభుత్వ ఉద్యోగం వైపు వేస్తున్నారు. కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత రాకపోతేనే ప్రైవేటు బాట పడుతున్నారు. తెలివితేటలుండి, మంచి నైపుణ్యాలున్న వారిలో 38 శాతంమంది సొంతంగా ఓ కంపెనీ పెట్టుకునేం దుకే ఆసక్తి చూపిస్తున్నారు. తమ నైపుణ్యాలను వేరే కంపెనీలకు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. మిగిలిన వారిలో 88 శాతం మందికి వృత్తి నైపుణ్యం గానీ, టెక్నికల్ డిప్లొమా లేదా టెక్నికల్ సర్టిఫికెట్ కూడా లేదు. దీని వల్ల వారికి ఉద్యోగం దొరక్క ఇన్ డైరెక్ట్ నిరుద్యోగ సమస్య ఏర్పడుతోందని సర్వే తేల్చింది. ఉద్యోగాలు దొరక్క ఏటా దేశంలో 1.2 కోట్ల మంది కార్మికులుగానైనా ఉపాధి పొందుతున్నారని పేర్కొంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే అది 50 లక్షల కన్నాతక్కువే. కాగా, మంచి ఉద్యోగం రావాలంటే ఆ  చదువు సరిపోదని, పై చదువులకు వెళ్లాల్సిందేనని,వృత్తి విద్యా కోర్సుల్ లో ట్రైనింగ్ తీసుకోవాలని సర్వేలో పాల్గొన్న 56 శాతం మంది యువత చెప్పారు. దేశంలో విద్యా, ఉపాధి, పర్యావరణ వ్యవస్థలోని సమస్యలు, సవాళ్లను ప్రభుత్వం , కంపెనీలు, ఇతర ప్రముఖుల దృష్టికి తీసుకళ్లేందుకే ఈ సర్వే చేసినట్టు ఎంఎస్ డీఎఫ్ ప్రోగ్రామ్ డైరె క్టర్ రాహిల్ రంగ్వాలా చెప్పారు. సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు అవకతవకలు జరగకుండా ఉండేందుకు చాలా కార్పొరేట్ కంపెనీలు ఆన్ లైన్ లోనే తమకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకుంటున్నాయి.

Latest Updates