ఏపీలో 9370 టెస్టులు.. 98 కొత్త కేసులు

  • ఇద్దరు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,370 శాంపిల్స్ టెస్టు చేయగా 98 మందికి పాజిటివ్ కన్ఫామ్ అయింది. కృష్ణా జిల్లాలో ఒకరు, చిత్తూరు జిల్లాలో ఒకరు వైరస్ ట్రీట్​మెంట్ తీసుకుంటూ చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 62కు పెరిగింది. ఆదివారం ఉదయం నాటికి రాష్ట్రంలో 3,042 వైరస్ కేసులు నమోదు కాగా.. 2,135 మంది వివిధ ఆస్పత్రుల్లో కోలుకుని డిశ్చార్చి అయ్యారు. 845 మందికి ట్రీట్ మెంట్ కొనసాగుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ ఆదివారం వెల్లడించింది.

Latest Updates