ఒక్కరోజే 96,424 కేసులు..87 వేల మంది డిశ్చార్జ్..

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 96,424 కేసులు నమోదవ్వగా 1174 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు సంఖ్య 52,14,678 కు చేరగా..మరణాల సంఖ్య 84,372 కు చేరింది. నిన్న ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 87 వేల మంది డిశ్చార్జ్  కావడంతో  కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య దేశంలో 41,12,552  కు చేరింది. ఇంకా 10,17,754 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

నిన్న ఒక్కరోజే 10,06,615 మందికి టెస్టులు చేశారు. దీంతో సెప్టెంబర్ 17 నాటికి దేశంలో టెస్టుల సంఖ్య 6,15,72,343 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

Latest Updates