ఐసీఎంఆర్ కు 99 అప్లికేషన్స్

న్యూఢిల్లీ : కరోనా నివారణకు ప్లాస్మా ట్రీట్ మెంట్ ఎంత వరకు సేఫ్ దీని ద్వారా ఉండే కాంప్లికేషన్స్ తగ్గించేందుకు స్టడీ చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇచ్చిన పిలుపుకు మంచి స్పందన వచ్చింది. 99 ఇన్ స్టిట్యూట్స్ ఈ స్టడీ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతూ అప్లికేషన్స్ పెట్టుకున్నాయి. కరోనాకు ప్రస్తుతం ప్లాస్మా థెరపీ బెస్ట్ ట్రీట్ మెంట్ గా భావిస్తున్నారు. ఐతే ఇది ఎంతవరకు సేఫ్ అన్న దానిపై ఐసీఎంఆర్ స్టడీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 12 ఆసక్తి ఉన్న ఇన్ స్టిట్యూషన్స్ నుంచి అప్లికేషన్స్ కోరింది. దీంతో 99 ఇన్ స్టిట్యూట్స్ ఇందులో పాల్గొనేందుకు ముందుకు వచ్చాయి. “ఐసీఎంఆర్ ఇచ్చిన పిలుపుకు మంచి స్పందన వచ్చింది. 99 సంస్థలు స్టడీలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికే జెనెరిక్ ప్రొటోకాల్ ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది ” అని ఐసీఎంఆర్ తెలిపింది. స్టడీలో పాల్గొనే ఇన్ స్టిట్యూట్స్ కు ఎథిక్స్ కమిటీ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పకుండా ఉండాలని ఐసీఎంఆర్ సూచించింది. ” ఐసీఎంఆర్ స్టాండర్డ్స్ ప్రకారం అర్హత కలిగిన సహకరిస్తాం. క్లినికల్ స్టడీ కోసం అవసరమైన పరికరాలను ఆయా సంస్థలు కొనుగోలు చేయాలి. ఇన్సూరెన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ప్రీమియం ఖర్చులను చెల్లిస్తాం ” అని కౌన్సిల్ తెలిపింది.

Latest Updates