ఒకే రోజు 9985 కరోనా కేసులు..279 మంది మృతి

భారత్ లో కరోనా విలయతాండవం చేస్తుంది. గత 24 గంటల్లో  9985 కరోనా కేసులు నమోదవ్వగా..279 మంది చనిపోయారు.  దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,76,583కు చేరగా.. మృతుల సంఖ్య 7745 కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 1,35,206 మంది కోలుకోగా..1,33,632 మంది చికిత్స తీసుకుంటున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 90787 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..3289 మంది చనిపోయారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్ 6వ స్థానంలో  ఉంది.

Latest Updates