24 గంటల్లో 9987 కరోనా కేసులు..331 మంది మృతి

భారత్ లో కరోనా రోజురోజుకు ఉధృతం అవుతోంది. ప్రతి రోజు దాదాపు 10 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 9987 కరోనా కేసులు నమోదవ్వగా..331 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  2,66,598 కు చేరగా..7466 మంది చనిపోయారు. ఇందులో ఇప్పటి వరకు 1,29,215 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 1,29,917 మంది చికిత్స తీసుకుంటున్నారు.  అత్యధికంగా మహారాష్ట్రలో 88529 కరోనా  కేసులు నమోదవ్వగా 3169 మంది చనిపోయారు. తమిళనాడులో 33,229 కేసులు,286 మంది,ఢిల్లీలో 29,943 కేసులు, 874 మంది , గుజరాత్ లో 20,545 కేసులు,1280 మంది మృతి చెందారు.

see more news

మేం మంచి దోస్తులం..మా మధ్య పోటీ పెట్టొద్దు

టెన్త్ విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చేది ఇలాగే..

Latest Updates