ఏపీలో కొత్తగా 9,996 కరోనా కేసులు.. 82 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గురువారం కూడా కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,996 కరోనా కేసులు నమోదైన‌ట్టు ఏపీ వైద్య ఆరోగ్య విడుద‌ల చేసిన మీడియా బులెటిన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,64,142కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 82 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2378కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,499 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 1,70,924కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 27,05,459 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 90,840 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరిలో 10 మంది, గుంటూరులో 10 మంది, అనంతపురంలో 8 మంది, కడపలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, విజయనగరంలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, కృష్ణాలో ఒకరు మృత్యువాత పడ్డారు.

జిల్లాల వారీగా .. అనంతపురంలో 856, చిత్తూరులో 963, తూర్పు గోదావరిలో 1504, గుంటూరులో 595, కడపలో 784, కృష్ణాలో 330, కర్నూలులో 823, నెల్లూరులో 682, ప్రకాశంలో 681, శ్రీకాకుళంలో 425, విశాఖలో 931, విజయనగరంలో 569, పశ్చిమ గోదావరిలో 853 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 క‌రోనా కేసులు నమోదయ్యాయి.

Latest Updates