నాపై తొమ్మిదో సారి దాడి..దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు

రోడ్ షోలో తనపై జరిగిన దాడిపై స్పందించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. గత ఐదేళ్లలో తనపై తొమ్మిది సార్లు..ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సార్లు దాడి చేశారని అన్నారు. దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిపై ఇన్ని సార్లు దాడి జరగలేదన్నారు. రాజకీయంగా తనను అణిచివేసే కుట్రలో భాగంగానే తనపై దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం బాధ్యత మాత్రమే ప్రతిపక్ష పార్టీ బీజేపీ చేతుల్లో ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్రపన్నుతున్నాయని.. తనపై ఎన్ని సార్లు దాడి చేసినా భయపడనని అన్నారు. దాడులు జరిగినా కొద్దీ తాను  మరింత బలపడతానని అన్నారు. తన గళం వినిపిస్తున్నందుకే తనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు కేజ్రీవాల్.

Latest Updates