ఎయిర్ పోర్ట్ లో కరోనా పేషెంట్ల పరుగులు : నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫేక్ వీడియో

“ఇప్పటికైనా కరోనా వైరస్ పైన అశ్రద్ధ వీడండి…. జాగ్రత్తలు పాటించండి.. ఇటలీ నుండి అడీస్ అబాబా విమానాశ్రయానికి  “ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్”  వచ్చింది.  ఇటలీ నుండి ఇథియోపియా ఫ్లైట్ లో వచ్చిన  ప్రతీ ఒక్కరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు వారి పరిస్థితి విమానాశ్రయం లో ఎలా ఉందో ప్రతి ఒక్కరూ గమనించి…జాగ్రత్తలు తీసుకోండి ” అంటూ ఓ ఫార్వర్డ్ మెసేజ్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో దగ్గుతూ, బ్రీతింగ్ సమస్యలతో బాధపడుతూ తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు ఓ బస్సు నుంచి ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ లోకి పరుగులు తీస్తుంటారు. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు గన్స్ తో పహారా కాస్తుంటే. డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని సారాంశం. ఆ వీడియో చూసిన నెటిజన్లు భయాందోళనకు గురవుతున్నారు.

అయితే ఆ ఫార్వర్డ్ వీడియో ఫేక్ అని తేలింది. ఫ్యాక్ట్ చెక్ లో పరిశీలిస్తే  2019నవంబర్ లో ఫ్రెంచ్ టీవీ ఛానల్ ఓ వీడియోను అప్ లోడ్ చేసింది.
వెస్ట్ ఆఫ్రికాలోని  సెనెగల్‌ కు చెందిన  బ్లేజ్ డయాగ్నే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి 43కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఏఎన్ ఐసీఎం అనే ఏవియేషన్ సంస్థ మాక్ డ్రిల్ ను నిర్వహించింది. విమాన ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై  మాక్ డ్రిల్ నిర్వహించినట్లు ఏఎన్ ఐసీఎం డైరెక్టర్ నండో తెలిపారు. దీంతో  వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని తేలడంతో నెటిజన్లు ఊపిరి పీల్చుకున్నారు.

Latest Updates