చెల్లిని హత్య చేసిన అన్న.. బాలిక మృతదేహాన్ని పీక్కుతిన్న నక్కలు

తన చెల్లెలు వేరు కులానికి చెందిన యువకుడిని ప్రేమిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసిన అన్న ఆమెను హత్య చేశాడు. డెడ్ బాడీని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశాడు.

టైమ్స్ న్యూస్ నౌ కథనం ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన అనీల్ సూర్య వంశీ (26) అతని చెల్లెలు (16) . బాధితురాలు వేరే కులానికి చెందిన యువకుడిని వేధిస్తుందంటూ అన్న సూర్య వాన్సీ హత్య చేశాడు. ఆపై బాలిక డెడ్ బాడీని బంజరు భూముల్లో వదిలేశాడు.  అయితే జూన్ 20న తమ కుమార్తె కనిపించడం లేదంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి కోసం పలు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా జూన్ 22న జిల్లాలోని దేగ్లూర్ తాలూకాలోని ధమ గావ్ గ్రామానికి చెందిన యువకులు బంజరు భూముల్లో డెడ్ బాడీ ఉందంటూ  పోలీసులకు సమాచారం అందించారు. యువకుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సగం  డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సగాన్ని నక్కలు పీక్కు తిన్నాయని పోలీసులు గుర్తించారు. అయితే బాలిక మరణం పై అనేక అనుమానాలు తలెత్తడంతో ఆమె తల్లిదండ్రులు అబ్బాయి కుటుంబ సభ్యులు హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేసులో నిందితుల్ని గుర్తించేందుకు పోలీసులు విచారణ చేపట్టగా..విచారణలో అన్న సూర్య వంశీ తన చెల్లెల్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.