తనపై అత్యాచారం చేసి వీడియోలు తీశారని…

తనపై అత్యాచారం చేసి వీడియోలు తీశారని ఓయువతి జూబ్లీహీల్స్  పోలీసులను ఆశ్రయించింది.  బాధితురాల ఫిర్యాదులో  పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. యువకుల తల్లిదండ్రులు కూడ బాధితురాలిపై ఫిర్యాదు చేశారన్నారు. అన్ని కోణాల్లో ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.

జూబ్లీహిల్స్ లోని ఓ కాలనీలో ఉండే యువతి(21) మోడలింగ్ చేస్తోంది. గతేడాది హైదరాబాద్ కి వచ్చి ఎల్లారెడ్డి గూడలోని షిర్డీసాయి విమెన్ హాస్టల్లో కొంత కాలం షెల్టర్ తీసుకుంది. ఆ సమయంలో హాస్టల్ నిర్వాహకురాలి కుమారుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పెళ్లి విషయంలో వివాదం నెలకొంది. దీంతో ఆ యువతి హాస్టల్ ఖాళీ చేసి సమీపంలో ఉన్నమరో కాలనీలోని ఓ పెంట్ హౌస్ లోఉంటోంది. ఈ క్రమంలో గత నెల 28న రాత్రి 7.30 గంటలకు పాత హాస్టల్ నిర్వాహకురాలి కుమారుడితో పాటు మరో యువకుడు ఆమె రూమ్ కి వెళ్లారు. గంజాయి మత్తులో ఇద్దరు యువకులు కలిసి తనపై అత్యాచారం చేశారని..దీన్నంతా మొబైల్ లో వీడియో తీశారని ఆ యువతి తన కంప్లయింట్లో తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని చెప్పింది. తనపై వేధింపులు,బెదిరింపులు ఎక్కు వ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆ యువతి చెప్పింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి  ఆ యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు బంజారాహిల్స్ ఏసీపీ కెఎస్ రావు చెప్పారు.

నా కొడుకును మోడల్ ట్రాప్ చేసింది: యువకుడి తల్లి

తన కొడుకును మోడల్ ట్రాప్ చేసిందని యువకుడు తల్లి ఆరోపించింది. తప్పుడు కేసు పెట్టి 20 లక్షలు డిమాండ్ చేసిందని చెప్పింది. పోలీసులు ఆడపిల్ల కదా అని కేసు పెట్టామన్నారని తెలిపింది. మగ పిల్లలను ట్రాఫ్ చేసి బెదిరింపులకు పాల్పడితే… ఆడపిల్లలపై కేసులు, చట్టాలు ఉండవా అని ప్రశ్నించింది. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని..తప్పంతా  మోడల్ దేనని అన్నది. తన కొడుకుతో పెళ్లికి కూడా సిద్ద పడిందని..మైనర్ తో వివాహం కుదరదని చెప్పానని అన్నది. మేజరయ్యాక మీ తల్లిదండ్రులతో ఒప్పించి వివాహం చేస్తా అన్నామని తెలిపింది.తన కొడుకు తప్పు చేశాడని విచారణలో తేలితే…ఏ శిక్ష విధించిన తనకు ఇబ్బంది లేదన్నది. మోడల్ తమ అబ్బాయిని ఎలా ట్రాప్ చేసిందో అన్ని ఆధారాలు ఉన్నాయని ఏసీపీ కి పిర్యాదు చేస్తామని చెప్పింది. డబ్బు కోసం మోడల్ తల్లిదండ్రులు కూడా దిగజారారని..వాళ్ళు కూడా రూ. 10 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోమన్నారని తెలిపింది.

Latest Updates