సుశాంత్ సింగ్ ఆత్మహత్య తట్టుకోలేక.. ఉరేసుకొని యువతి ఆత్మహత్య

హీరో సుశాంత్ సింగ్ ను అభిమానించే ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారింది. ఎటువంటి సపోర్ట్ లేకుండా సింగిల్ గా వచ్చి బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సుశాంత్ సింగ్ గత వారం ఆయన నివాసంలో  ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై ఆయన అభిమానులు మనోవేధనకు గురవుతున్నారు.

తాజాగా విశాఖకు చెందిన ఓ యువతి (21) సుశాంత్ ఆత్మహత్యను తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది. టైమ్స్ న్యూ నౌ కథనం ప్రకారం.. వైజాగ్ శ్రీహరి పురానికి చెందిన ఓ యువతి (21) ప్రైవేట్ స్కూల్ టీచర్ గా విధులు నిర్వహిస్తుంది. అయితే ఆ యువతి తన ఇంట్లో సీలింగ్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాల్ని చూసేందుకు ఆమె స్నేహితులు ఇంటికి వచ్చారు. ఆమె గదిలో ఉండడంతో..డోర్ తీయాలంటూ  స్నేహితులు కోరారు.  కానీ లోపలి నుంచి ఎటువంటి రిప్లయ్ లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు డోర్ ను బలవంతంగా పగలగొట్టారు. లోపల  విగతజీవిగా ఉరికి వేలాడుతూ కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటూ  పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ఆమె సెల్ ఫోన్ డేటా ను చెక్ చేయగా.. సుశాంత్ సింగ్ కు చెందిన పలు  వీడియోలు, ఆత్మహత్య చేసుకున్న ప్రసారమైన వీడియోలు లభ్యమయ్యాయి. ఆ వీడియోల ఆధారంగా ఆమె తల్లిదండ్రుల్ని విచారించగా …తన కుమార్తె సుశాంత్ సింగ్ అభిమాని అని, ఆయన ఆత్మహత్య చేసుకున్న నాటి నుంచి అందరితో మాట్లాడడం మానేసిందని పోలీసులకు చెప్పారు.  బాధితురాల్ని చూసేందుకు ఆమె స్నేహితులు ఇంటికి వచ్చారని..గదిలో ఉన్న తనని పిలిచే ప్రయత్నం చేసినా ఆమె పలకపోవడంతో డోర్ ను బలవంతంగా గొట్టి ఓపెన్ చేసినట్లు పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులకు చెప్పారు.  బాధితురాలు సుశాంత్ సింగ్ మరణాన్ని తట్టుకోలేక.. పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లి ప్రాణాల్ని కోల్పోయిందని పోలీసులు తెలిపారు.

Latest Updates