200 అడుగుల బోరు బావిలో పడ్డ ఆరేళ్ల చిన్నారి

ఎన్ని చోట్ల పిల్లలు బోరు బావుల్లో పడుతున్నా.. జనాల్లో మార్పు రావడం లేదు. మళ్లీ మళ్లీ అవే ఘటనలు జరుగుతున్నాయి.

మహారాష్ట్రలో ఇవాళ ఓ ఆరేళ్ల పిల్లాడు బోరు బావిలో పడిపోయాడు. పుణే సమీపంలోని అంబెగావ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. డాక్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ కూడా చేరారు.

ఆ బోరు బావి 200 అడుగుల లోతు ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆ చిన్నారి 10 అడుగుల లోతులోనే చిక్కుకుని ఉన్నాడని రెస్క్యూ టీం అంచనా వేస్తోంది. పిల్లాడిని వీలైనంత త్వరగా క్షేమంగా బయటకు తీస్తామని అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్తగా లోపలికి పైప్ పంపి దాని ద్వారా చిన్నారికి ఆక్సిజన్ అందిస్తున్నామన్నారు.

Latest Updates