హన్మకొండలో దారుణం : 9 నెలల పసికందును గొంతు నులిమి హత్య

వరంగల్ జిల్లా హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. 9 నెలల పసికందును గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడో కిరాతకుడు. హన్మకొండలో ఉంటున్న జగన్, రచన దంపతులకు శ్రిత అనే 9 నెలల పాప ఉంది. తల్లిదండ్రులు డాబాపై నిద్రిస్తుండటంతో.. ప్రవీణ్ అనే వ్యక్తి పాపను ఎత్తుకెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు.

పాప కేకలు విని తండ్రి వెళ్ళడంతో.. ప్రవీణ్ పారిపోయాడు. హుటాహుటిన పాపను హన్మకొండలోని, హాస్పిటల్ కి తరలించారు. డాక్టర్లు పరీక్షలు చేసి పాప చనిపోయినట్లు నిర్థారించారు. పాప మృత దేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ప్రవీణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Latest Updates