క్యూ లైన్ లో కుప్పకూలిపోయాడు : 95 ఏళ్ల వృద్ధుడు మృతి

ఒడిషా లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా విషాదం జరిగింది. గంజం జిల్లాలోని సనకే ముండి మండలం.. కన్సామరి పోలింగ్ బూత్ లో ఓట్ వేసేందుకు 95 ఏళ్ల వృద్ధుడు వచ్చాడు. క్యూలైన్ లో నిల్చుని తన వంతుకోసం ఎదురుచూశాడు. ఐతే.. కొద్దిసేపటికే ఆయన ఉన్నచోటే కుప్పకూలిపోయాడు. ఎన్నికల సిబ్బంది వెంటనే ఆయన్ను దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఐతే.. అప్పటికే ఆయన చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించారు. కన్సామతి గ్రామానికి చెందిన నటాబర్ బెహరాగా ఆయన్ను గుర్తించారు.

ఒడిషాలో ఇవాళ 5 లోక్ సభ సెగ్మెంట్లు… 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. సుందర్ గఢ్, బొనాయ్ అసెంబ్లీ సెగ్మెంట్లలోని చాలా పోలింగ్ బూత్ లలో టెక్నికల్ సమస్యలతో EVMలు పనిచేయలేదు. పలుచోట్ల ఆలస్యంగా పోలింగ్ మొదలైంది.

Latest Updates