నిలోఫర్ లో వింత శిశువు జననం

నిలోఫర్ లో వింత శిశువు జననం

నాంపల్లి, వెలుగు: నిలోఫర్ లో వింత శిశువు జన్మించింది. సిటీ పరిధిలోని కాప్రాకి చెందిన సరళ, విజయ కుమార దంపతులకు ఈ నెల 19న ఆడ పిల్ల పుట్టగా, సాధారణ శిశువులాగా కాకుండా అవయవాలు పరిపక్వత చెందకుండా ఉంది. హెర్లీక్వీన్ ఇచియోసీస్ అనే జన్యుపరమైన లోపంతో శిశువు జన్మించినట్లు డాక్టర్లు తెలిపారు. శిశువు పరిస్థితి విషమంగా ఉందన్నారు. గతంలో కూడా సరళ నిలోఫరలోనే వింత శిశువుకు జన్మనిచ్చినట్లు డాక్టర్లు చెప్పారు.