పోలీసుల చేతిలో డబ్బుల బ్యాగు..రఘనందన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత

సిద్దిపేటలోని రఘనందన్ రావు ఇంటి దగ్గరికి పోలీసులు ఓ బ్యాగ్ తో రావడం కలకలం రేపుతోంది. వేరే ఇంట్లో  దొరికిన డబ్బులను రఘునందర్ రావు మామ.. గోపాల్ రావు ఇంట్లో పెట్టేందుకు పోలీసులే డబ్బు తీసుకొచ్చారని కార్యకర్తలు ఆరోపించారు. పోలీసులు డబ్బు బ్యాగ్ తీసుకొస్తున్న దృశ్యాలను కార్యకర్తలు రికార్డ్ చేశారు. పోలీసులు డబ్బులు దాచేందుకు ప్రయత్నించడంతో.. ఆగ్రహించిన కార్యకర్తలు పోలీస చేతిలో నుంచి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశారు.

దాదాపు నాలుగు గంటలుగా సిద్ధిపేటలో టెన్షన్ కొనసాగుతోంది. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ బంధువుల ఇండ్లలో పోలీసులు సోదాలు చేయడంతో ఉద్రిక్తత మొదలైంది. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు వందలాదిగా రఘునందన్ మామ ఇంటికి చేరుకోవడంతో టెన్షన్ మొదలైంది. అటు పోలీసులు కూడా భారీగా మొహరించడంతో టెన్షన్ పెరిగింది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో రఘునందన్ కింద పడిపోయారు. దీంతో కిద్దిసేపు ఆయన అస్వస్థతకు గురయ్యారు. సిద్ధిపేటకు వస్తున్న బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్ఢుకంటున్నారు పోలీసులు. దీంతో కొన్నిచోట్ల రోడ్డుపైనే బైఠాయించారు కార్యకర్తలు. రఘునందన్ మామ ఇంటిదగ్గర ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలను అక్కడ్నుంచి పంపేందుకు పోలీసులు లాఠిచార్జి చేశారు.

Latest Updates