ఇంత పర్ఫెక్ట్ హెయిర్ కట్.. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్!

న్యూఢిల్లీ: లుక్స్ బాగా కనిపించడంలో హెయిర్ స్టయిల్ చాలా ముఖ్యమనేది తెలిసిందే. కేవలం హెయిర్ స్టయిల్ కోసం రూ.వేలు ఖర్చు పెట్టే వాళ్లు కూడా ఉన్నారు. మంచిగా హెయిర్ స్టయిల్ చేసే బార్బర్స్ కు పెద్ద మొత్తంలోనే డబ్బులు అందుతుంటాయి. అయితే డబ్బుల విషయం పక్కనబెడితే కొందరు మాత్రం పర్ఫెక్షన్ కు వ్యాల్యూ ఇస్తారు. పని విషయంలో చాలా డిసిప్లిన్డ్ గా. కచ్చితత్వంతో ఉంటారు. ఇప్పుడు అలాంటి ఒక బార్బర్ వర్కింగ్ స్టయిల్ నెట్ లో వైరల్ అవుతోంది. షాప్ కు వచ్చిన ఒక కస్టమర్ కు డిఫరెంట్ యాంగిల్స్ నుంచి హెయిర్ కట్ చేస్తూ పర్ఫెక్షన్ కోసం అతడు యత్నించిన తీరు అందర్నీ నవ్విస్తోంది. హెయిర్ కట్ చేశాక బయటి కిటికీలో నుంచి, దూరంగా ఉన్న చెట్టు దగ్గర నుంచి చూడటం గమ్మత్తుగా చెప్పొచ్చు. సౌత్ కరోలినాలోని సదరు హెయిర్ సలూన్ పేరు ‘అప్ స్కేల్ కట్స్ అండ్ స్టైల్జ్’. పేరులో ఉన్న వైవిధ్యతే అందులోని బార్బర్ కు ఉంది మరి. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్స్ హెయిర్ కట్ లో పర్ఫెక్షన్ కోసం సదరు బార్బర్ పడిన తపనను మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అతడు చెట్టు దగ్గర నుంచి చూడటం పై విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. 5.5 మిలియన్ల వ్యూస్ వచ్చిన ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి మరి!

Latest Updates