కలాం బయోపిక్‌‌లో అనిల్ కపూర్

A biopic on A P J Abdul Kalam

బాలీవుడ్‌‌ బయోపిక్‌‌ ఎక్స్‌‌ప్రెస్ ఆగడం లేదు. అక్కడ వరుసగా జీవిత గాథలు సినిమాలుగా మారిపోతున్నాయి. అన్ని రంగాల్లోని ప్రముఖుల జీవితాలూ సెల్యులాయిడ్‌‌పై ప్రత్యక్షమవడానికి వేగంగా ముస్తాబవుతున్నాయి. ఇప్పుడు తాజాగా అబ్దుల్ కలాం బయోపిక్‌‌ ఈ రేస్‌‌లో  నిలబడింది. 1998, మే 11న పోఖ్రాన్‌‌లో అణు పరీక్షలు నిర్వహించారు. ఆ రోజును నేషనల్ టెక్నాలజీ డేగా ప్రకటించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కలాం బయోపిక్‌‌ ప్రకటనను రిలీజ్ చేశారు బాలీవుడ్ ప్రొడ్యూసర్ అభిషేక్
అగర్వాల్. అబ్దుల్ కలాం పాత్రలో అనిల్‌‌ కపూర్ నటించనున్నారు.  భారీ బడ్జెట్‌తో రూపొందించే ఈ చిత్రానికి రాజ్ చెంగప్ప రాసిన కలాం జీవిత చరిత్ర  ఆధారమని తెలుస్తోంది.