ఒక బిట్ కాయిన్ రూ.8.33 లక్షలు

కరోనాతో భారీగా పెరుగుతున్న వాల్యూ

ఇన్వెస్టర్లు, ట్రేడర్ల చూపు వీటి వైపే..

తక్కువగా ఉన్న సప్లయ్

బిజినెస్ డెస్క్, వెలుగు: కరోనా టైములో బిట్ కాయిన్ దూసుకుపోతోంది. ప్రసుత్తం ఒక బిట్ కాయిన్ వాల్యూ రూ. 8.33లక్షలు (11,123 డాలర్లు) దాటేసింది. గత కొన్ని సెషన్ ల నుంచి డాలర్ మారకంలో బిట్ కాయిన్ భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో బిట్ కాయిన్ వాల్యూ 5,000 డాలర్లకు పడిపోయింది. అక్కడి నుంచి బుధవారం నాటికి ఈ వాల్యూ 6,000 డాలర్లు పెరిగింది. కరోనా సంక్షోభంతో మార్చి నెలలో ఇతర ఎసెట్స్ మాదిరే క్రిప్టో కరెన్సీల వాల్యూ కూడా భారీగా పడిపోయిందని ఎనలిస్టులు చెప్పారు. తిరిగి వీటి వాల్యూ రికవరీ అవుతుండడంతో బిట్ కాయిన్ కూడా పుంజుకుంటోందని చెప్పారు. ఇండియాలో కూడా గత కొన్ని నెలల నుంచి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పెరిగిందని, దీంతో బిట్ కాయిన్ వాల్యూ మరింత వృద్ధి చెందిందని అన్నారు.

బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ను క్రిప్టో కరెన్సీ చెల్లింపుల కోసం వాడడాన్ని ఆర్బీఐ 2018 లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ బ్యాన్ ను సుప్రీం కోర్టు మార్చిలో కొట్టేసింది. అప్పటి నుంచి ఇండియాలో క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్ మెంట్స్ ఊపందుకున్నాయి. బిట్ కాయిన్ పెరగడోం ఆల్ట్ కాయిన్స్ కూడా పెరుగుతున్నాయి. బిట్ కాయిన్ సక్సెస్ తర్వా వచ్చిన ఇతర క్రిప్టో కరెన్సీ ఆల్ట్ కాయిన్స్ గా కూడా  పిలుసుస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నాటికి 5,000 పైగా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయని అంచనా. కరోనా సంక్షోభంతో షేర్లకు ప్రత్యామ్నాయ మార్గాలను ఇన్వెస్టర్లు వెతుకుతున్నారని క్రిప్టో కరెన్సీ ఎక్ఛేంజ్ కాయిన్ డీసీ ఎక్స్ ఫౌండర్ సుమిత్ గుప్తా అన్నారు. ఇలాంటి టైమ్ లో క్రిప్టో ల వైపు ఇన్వెస్టర్లు దృష్టి పెడుతున్నారని చెప్పారు.దీంతో పాట సర్క్యులేషన్ లో ఉన్న బిట్ కాయిన్లు కూడా తగ్గి పోవడంతో వీటి వాల్యూ అమాంతం పెరిగిందని అన్నారు.

ఈ ఏడాది ప్రారంభం నాటికి సగం బిట్ కాయిన లే సర్క్యులేషన్ లో ఉన్నాయి. అంతేకాకుండా మైనింగ్ చేసి బిట్ కాయిన్లు కనిపెట్టిన వారికి వీటిలో సగం రివార్డు అందుతుంది. దీంతో చెలామణి లో వీటి కొరత ఉంటుందని విశ్లేషకులు చెప్పారు. సాధారణంగా ఏ ఎసెట్ ధరలైన పెరుగుతున్నాయంటే  దానికి కారణం ఇన్వెస్టర్లని బ్లాక్ చెయిన్ అండ్ క్రిప్టో కరెన్సీ కమిటీ ఆఫ్ ది ఇంటర్నెట్ అసోసియేషన్ (ఐఏఎంఏఐ) అజిత్ ఖురానా పేర్కొన్నారు. ఎసెట్ ఒలటైల్ గా ఉండడానికి కారణం ట్రేడర్లని పేర్కొన్నారు. గత కొన్ని నెలల నుంచి అటు ఇన్వెస్టర్లకి, ఇటు ట్రేడర్లకి బిట్ కాయిన్ ఆకరష్ణీయంగా కనిపిస్తోందని చెప్పారు. క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్ లలో పాల్గొనే వారు ఇతర ఎసెట్ల వైపు వెళ్లరని ఆయన అభిప్రాయపడ్డారు.

బిట్ కాయిన్ మైనింగేంటి?

బిట్ కాయిన్ ఒక క్రిప్టో కరెన్సీ. వీటికి ఏ సెంట్రల్ బ్యాంక్ సపోర్టు ఉండదు. కాంప్లెక్స్ కంప్యూటర్ అల్గారిథమ్ లను పరిష్కరించడం ద్వారా వీటిని క్రియేట్ చేస్తారు. వీటిని సాధారణ కంప్యూటర్లలో క్రియేట్ చేయడం అసాధ్యం. ఇప్పటి వరకు సుమారు 21 మిలియన్ల బిట్ కాయిన్లు మాత్రమే క్రియేట్ చేయగలిగారు. ఈ క్రియేట్ చేయడాన్నే మైనింగ్ అంటారు. మైనర్లు కొత్త బిట్ కాయిన్లను బ్లాక్ చెయిన్ నెట్ వర్క్ కు యాడ్ చేస్తారు. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గతంలో విధించిన పేమెంట్ బ్యాన్ ను ఇటీవల సుప్రీం కోర్టు కొట్టేసినప్పటికీ ఇండియాలో క్రిప్టో కరెన్సీ రెగ్యులూటరీ ఫ్రేమ్ వర్క్ ఇంకా రెడీ కాలేదు. మరోవైపు దేశంలో ఎవరి వద్దైనా బిట్ కాయిన్లు ఉంటే వారిపై కిమినల్ కేసులు పెట్టేలా ప్రభుత్వం ఓ డ్రాఫ్ట్ ను కూడా రెడీ చేస్తోంది. క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ఎంటర్ కావాలనుకునే ఇన్వెష్టర్లు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవడం చాలా ముఖ్యం.

                               ప్రస్తుతం బిట్ కాయిన్ చుట్టూ పాజిటివ్ ఎన్విరాన్ మెంట్ ఉంది. బిట్ కాయిన్ ధరలు పెరుగుతుండడంతో ఇప్పటి వరకు ఆగిన ఇన్వెస్టర్లు కూడా వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు మళ్లీ రెడీ అవుతున్నారు. వీరితో పాటు ఎక్కువ ప్రాఫిట్స్ బుక్ చేసుకునేందుకు ట్రేడర్లు కూడా అధిక మొత్తంలో ట్రేడింగ్ చేస్తున్నారు. మా ప్లాట్ ఫామ్ లో క్రిప్టో కరెన్సీల ట్రేడిండ్ వాల్యూ భారీగా పెరిగింది. భవిష్యత్తులో బిట్ కాయిన్ ఏ రేంజ్ కు వెళుతుందోనని ఆశ్చర్యంగా ఉంది.– నిశ్చల్ షెట్టి, ఇండియన్ క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ వజిర్ ఎక్స్ ఫౌండర్.

Latest Updates