12గంటలపాటు అమ్మాయిల హాస్టల్ గదిలో ఉన్న యువకుడు

కృష్ణా జిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీలో కలకలం రేగింది. బాలికల హాస్టల్ లోకి ఓ యువకుడు చొరబడ్డాడు. ఈ నెల 16న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి కిటికీ ఊచలు తొలగించి.. యువకుడు హాస్టల్ లోకి చొరబడ్డాడు. తోటి విద్యార్థినిల సమాచారంతో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి చెక్ చేయగా.. మంచం కింద దాక్కుని ఉన్న యువకుడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విషయం బయటకు రాకుండా.. యువతీ, యువకుడి తల్లిదండ్రులను పిలిచి వారిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు.. మరో నలుగురు స్టూడెంట్స్ ను కూడా సస్పెండ్ చేశారు ట్రిపుల్ ఐటీ అధికారులు. సెక్యూరిటీ లోపాలపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.

Latest Updates