సెప్టిక్ గుంతలో పడి బాలుడి మృతి

నారాయణపేట టౌన్​, వెలుగు: సెప్టిక్‌ గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట మండలం జాజాపూర్‌ కు చెందిన నరేశ్ గ్రామ సేవకుడిగా పనిచేస్తున్నాడు. బాత్‌ రూం కోసమని ఇటీవల ఇంటి ముందు గుంత తవ్వి ఇటుకలతో సెప్టిక్‌ ట్యాంక్‌ నిర్మించాడు. టెస్టింగ్‌ కోసమని అందులో నీటిని నింపాడు. శనివారం అతని కొడుకు రుషికుమార్‌ (5) ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. ఎవరూ గమనించక పోవటంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందు అడుతూ తిరిగే బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

మరిన్ని వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

Latest Updates