కేరింత నటుడు విశ్వంత్ పై చీటింగ్ కేసు

కేరింత నటుడు  విశ్వంత్ పై బంజారహిల్స్ లో కేసు నమోదైంది. తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తానని  మోసం చేశారని విశ్వంత్ తో పాటు మరో ఇద్దరిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటున్న రెడ్డి రామకృష్ణ అనే వ్యాపారి 2017లో కారు కొనాలనుకున్నాడు. 30 శాతం తక్కువ ధరకు ఇన్నోవా కారు ఇప్పిస్తామని నటుడు విశ్వంత్‌, అతడి తండ్రి లక్ష్మీకుమార్ అలియాస్ సాయిబాబా వ్యాపారికి చెప్పారు. తమకు బంజారాహిల్స్‌లోని ఓ‌ ఇంటీరియర్స్  షోరూం అధినేత ఆత్మకూరు ఆకాశ్‌ గౌడ్‌ తెలుసునని, అతడి ద్వారా తక్కువ ధరకే కారు ఇప్పిస్తామని వ్యాపారిని నమ్మించారు. ఇదంతా నమ్మిన వ్యాపారి.. లక్ష్మీకుమార్‌కు అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు చెల్లించాడు. మరో నెల రోజుల తర్వాత రూ.2.50 లక్షలు చెల్లించాడు. అనంతరం కారును వ్యాపారికి అందించిన లక్ష్మీకుమార్.. వాహనాన్ని మాత్రం వ్యాపారి పేరు మీదకు ట్రాన్స్‌ఫర్‌ చేయలేదు. అయితే అదే కారుపై ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.20లక్షలు అప్పు తీసుకున్నట్లు వ్యాపారి తెలుసుకున్నాడు. ఎన్ని సార్లు అడిగినా విశ్వంత్‌, అతడి తండ్రి డబ్బు తిరిగివ్వకుండా తప్పించుకుని తిరుగుతుండడంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఆత్మకూరు ఆకాశ్‌ గౌడ్‌, లక్ష్మీ కుమార్, నటుడు విశ్వంత్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు.

see more news

ఇంటి ముందున్న చెట్టు నరికిన యజమానికి భారీ ఫైన్..

Latest Updates