ఓయూలో సభ.. ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు

బెంగుళూరు ఎంపీ, బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్విీ సూర్యపై  కేసు నమోదైంది. అనుమతి లేకుండా ఉస్మానియా యూనివర్శిటీలో సభ నిర్వహించినందుకు తేజస్వీతో పాటు బీజేపీ నేతలపై ఓయూ అధికారులు ఫిర్యాదు చేశారు.  ఐపీసీ 447, హైదరాబాద్ సీపీ యాక్ట్ 21/76 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నెల 24న  ఉదయం తేజస్వీ సూర్య పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలతో ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్లారు. వర్సిటీలోకి పాదయాత్రగా వెళ్తున్న తేజస్వీని ఎన్సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో గేట్లు దూకి బీజేపీ కార్యకర్తలు లోపలికి వెళ్లారు. 1969 తెలంగాణ అమరులను స్మరించుకోవడానికి తేజస్వీ ఓయూకు వెళ్లారు.

Latest Updates