స్నేహం అంటే వీళ్లదే..ఎక్కడికెళ్లినా తోడుగా…

స్నేహం అనేది ఎంత స్వచ్ఛమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భూమిపై ఉన్న రిలేషన్స్ లో గొప్ప రిలేషన్.  మనుషుల్లోనైనా.. జంతువుల్లోనైనా స్నేహాం గొప్పది. అయితే  స్నేహానికి అర్థాలే మారుతున్న ఈ రోజుల్లో అసలైన స్నేహం  జంతువులను చూసి నేర్చుకోక తప్పదేమో అనిపిస్తుంది.

న్యూ జెర్సీలోని టార్టల్ బ్యాక్ జూలో చిరుత (నంది), కుక్క(బౌవీ) స్నేహాన్ని చూస్తే స్నేహం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ జూలో చిరుత, కుక్క కొన్ని రోజులుగా కలిసి పెరుగుతున్నాయి. ఎంతలా అంటే వాటి స్నేహాన్ని చూస్తే  కుల్లుకోక తప్పదు. ఆడుతూ, పాడుతూ, గంతులేస్తూ, కుస్తీ పడుతూ కలిసి మెలసి జీవిస్తున్నాయి.

అయితే చిరుతలు  చిన్నప్పుడు మృదు స్వభావంతో ఉంటాయంట. డల్ గా, వీక్ గా ఉంటాయంట. అందుకే చిరుతను ఉత్సాహ పరచడానికి దానిలో ఆత్మవిశ్వాసం  నింపడానికి ఉషారుగా ఉండే కుక్కను తెచ్చి జూలో పెంచుతున్నారంట. ఇవి కాస్త బెస్ట్ ఫ్రెండ్స్ గా మారాయంట. ఎంతలా అంటే ఒకదానిని విడిచి ఒకటి ఉండలేవంట. ఎక్కడికెళ్లిన బౌవీ, నంది అదేనండి చిన్ని చిరుత, కుక్క కలిసే వెళతాయంట.

Latest Updates