2019లో ఎయిడ్స్‌ వ్యాధితో మరణించిన పిల్లలు లక్షకు పైనే..

2019 లో ప్రతీ  నిమిషానికి 20 ఏళ్లలోపు యువకుల నుంచి  పిల్లల వరకు  హెచ్‌ఐవి బారిన పడ్డారని యూఎన్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) తెలిపింది. దీనికి తోడు హెచ్ఐవీ బారిన పడిన బాధితులకు ట్రీట్మెంట్ అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళన కలిగించే అంశమని తెలిపింది. 2019లో దాదాపు 3,20,000 మంది పిల్లలు,  యువకులకు హెచ్ ఐవీ సోకినట్లు తెలిపింది. అదే ఏడాదిలో సుమారు 1,10,000 మంది పిల్లలు ఎయిడ్స్‌ వ్యాధితో మరణించినట్లు ప్రముఖ మీడియా సంస్థ జిన్‌హు వా తెలిపింది.

ఇప్పటికీ అనేక మంది పిల్లలు ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్నారని , కరోనా కారణంగా హెచ్ ఐవీ ట్రీట్మెంట్ తో పాటు నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్ల భారీ ఎత్తున బాధితులు తమ ప్రాణాల్ని ఫణంగా పెట్టారని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ చెప్పారు.

యునిసెఫ్ వివరాల ప్రకారం.., కరోనా కారణంగా పిల్లలు, యువకులు మరియు గర్భిణీలను కాపాడేందుకు ఇచ్చే హెచ్ ఐవీ వ్యాధినిరోధక మెడిసిన్ అందించడంలో అంతరాయం ఏర్పడిందని, తద్వారా హెచ్ఐవి ఎక్కువగా  ఉన్న దేశాలలో మూడింట ఒకటోవంతు మందికి కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.

Latest Updates